ప్రజాస్వామ్య గొంతుక - మన ఊరి సర్పంచ్ - Educative

ప్రజాస్వామ్య గొంతుక - మన ఊరి సర్పంచ్

Geschichtenbeschreibung

గ్రామ అభివృద్ధిని కోరుకుంటూ, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛతో నిజమైన సర్పంచ్ లక్షణాలను, పారదర్శకతను ప్రశ్నించే ఒక సామాజిక చైతన్య కథ. ఓటు విలువను, ప్రజా ప్రతినిధుల బాధ్యతను గుర్తుచేసే చక్కటి దృశ్యం.

Valutazioni:Valutazioni insufficienti
Sprache:te
Veröffentlicht am:
Kategorie:Educative
Lesezeit:1 Minuten

Schlüsselwörter

Prompt di generazione

పంచాయతీ లో 144 సెక్షన్ అమలులో ఉంది కాబట్టి ఎవరినీ ఉద్దేశించకుండా, ఎవరినీ కించపరకుండా నాకు నా రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగంలోని మూడవ భాగంలో, ఆర్టికల్స్ 19 నుండి 22 వరకు పొందుపరచబడిన వ్యక్తి గత స్వేచ్ఛ హక్కుతో నా ఓటు కోసం నా ఇంటిగడప ఎక్కే నా ఊరి సర్పంచ్ కు ఉండవలసిన లక్షణాలు చెప్పుకుంటున్నాను. 1)గ్రామ సభలు జరిగిన ప్రతి సారి గెలుపు ఓటములతో సంభంధం లేకుండా పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా పంచాయితీ లో జరిగే ప్రతి గ్రామ సభకు హాజరయ్యి ఉండాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు ముందు సర్పంచ్ అభ్యర్థికి తెలియాలి.. సర్పంచ్ కుటుంబసభ్యులకు, సర్పంచ్ వెనకుండే చెంచాలకు కాదు. 2) ఊరి కి సంభందించి ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నాయకులు,కార్యకర్తలను మాత్రమే కాకుండా ప్రజలను కూడా సమావేశపరిచి ప్రజల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలి. సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలకు జవాబు చెప్పాల్సిన సందర్భంలో సర్పంచ్ అభ్యర్థి మాత్రమే జవాబుదారీతనం వహించాలి.. వెనకున్న సర్పంచ్ చెంచాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ గురించి కానీ పంచాయతీ ప్రజల గురించి కానీ రెచ్చగొట్టే విధంగా అసభ్యకరంగా బూతులు కానీ, జాతులు గురించి కానీ, కులాలు గురించి కానీ హేళన చేసే విధంగా మాట్లాడకూడదు. 【అమ్మా ,బాబూ అంటూ మా పార్టీకి ఓటు వేయండి , మా వ్యక్తి కి ఓటు వేయండి, మా గుర్తుకు ఓటు వేయండి అని ప్రజల ఇంటి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర చేతులు జోడించి మరీ ముష్టి అడుక్కునే మీకు, పంచాయతీ ప్రజల జాతుల గురించి కానీ, కులాల గురించి కానీ కించపరిచే విధంగా తక్కువచేసి మాట్లాడే హక్కు నాయకులకు కానీ నాయకుల చెంచాలకు కానీ ఎక్కడ నుండి వచ్చింది. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడడానికి అసలు మీరు ప్రజాప్రతినిధులా లేక పోరంబోకులా!.. నాయకులు కానీ నాయకుల చెంచాలు కానీ నోటి దూలని కాస్త అదుపులో పెట్టుకోండి. ( ఇక్కడ చెంచాలు అనేది ఏ ఒక్కరిని ఉద్దేశించి అన్న పదం కాదు, నిజంగా చెంచాలకే అన్నాను. ఇంగ్లీష్ లో spoons అంటారు. పంచాయతీ నిధులు అనే కంచానికి, ప్రజల అవసరాలు అనే నోటికి వారధిగా పని చేసేవాళ్లు అని నా ఉద్దేశం.. కాదని మీరు తప్పుగా అర్ధం చేసుకుంటే మీరు భావించిన ఆ తప్పు కూడా నేను నిజమే అంటాను.)】 3)ముఖ్యంగా గ్రామానికి సంభందించి ఏదైనా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు గెలిచిన సర్పంచ్ , MPTC సంతకాలతో పాటు ప్రజల సంతకాల సేకరణలో భాగంగా కేవలం రావిపాడు ఒక పొలిటికల్ పార్టీ కి సంభందించిన గ్రామప్రజల సంతకాలు మాత్రమే కాకుండా పంచాయితీ లో ఉన్న అన్ని వార్డుల నుండి కనీసం ఇద్దరు చొప్పున సంతకాల సేకరణ జరగాలి. ఆ రెండు సంతకాలు మాత్రం నిసాని గా చెప్పబడే వేలి ముద్రలు కాకుండా విద్యావంతుల సంతకాలు అయ్యిఉండాలి. ఎందుకంటే ఈ వే లొనే పంచాయితీలో తప్పులు జరుగుతున్నాయి.. (అసలు చాలామంది గ్రామ ప్రజలుకు ఆ తీర్మానం దేని గురించి అన్నది తెలియకపోవడానికి మూడే కారణాలు 1) నాయకుల మేధస్సు తో కూడిన రాజకీయం. 2) ప్రజల అజ్ఞానం తో కూడిన నిర్లక్ష్యం, 3) ఎలక్షన్స్ అప్పుడు నాయకుల జండాలు మోసి తరువాత నాయకుడిని ప్రశ్నించని యువత. 4) ప్రజల అవసరాలకు సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ కానీ, పంచాయతీ VRO కానీ, పంచాయితీ ఎలక్ట్రికల్ లైన్ మేన్ కానీ ఇలా ఏ సిబ్బంది ఐనా వాళ్ళ ఉద్యోగ టైమింగ్స్ ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో లేకపోతే కేవలం పంచాయతీ సర్పంచ్ యొక్క అసమర్థత, చేతకానితనం గానే మేము భావిస్తాం.. ఆ చేతకానితనాన్ని సర్పంచ్ అంగీకరించాలి. ఈ విషయంలో ప్రజల నుండి వ్యతిరేకత వస్తే కొన్ని మాటలు పడాల్సి వస్తుంది.. కాబట్టి భార్యలను సర్పంచ్ అభ్యర్థులుగా నిలబెట్టే భర్తలు ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని అన్నింటికీ సిద్ధపడి అప్పుడు ఎలక్షన్ పోటీలో పోటీ చేయండి...లేదా మీ రాజకీయ పార్టీ B ఫామ్ పక్కన పెట్టి మీ ఇంటి ఆడవాళ్లను అడ్డు పెట్టకుండా ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేయండి. 5)మరో ముఖ్యమైన విషయం మీ పార్టీ నాయకులు (MLA, MP ,ZPTC,......)గ్రామానికి వస్తే ఆ నాయకుల పర్యటనకు అయ్యే మెంటేనెస్ ఖర్చు, బ్యానర్ల ఖర్చు అనేది మీరు, మీ చెంచాలు కలిపి మీ సొంత ఖర్చుగా పెట్టుకోండి.. అంతే తప్ప పంచాయితీ నిధులలో బిల్లు పెట్టమని పంచాయితీ సిబ్బంది పై ఒత్తిడి తెచ్చి పంచాయతీ నిధులు పై ఆశ పడకండి.. పంచాయితీ నిధుల్లో ప్రతి రూపాయికి ప్రజలకు లెక్కచెప్పాల్సిన భాద్యత మీపై ఉంటుంది.. గతంలో నాయకుల అసమర్థత వల్ల పంచాయతీకి రావాల్సిన నిధులు వెనక్కి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి..అలాంటి పొరపాటు ఇక పై ఎప్పుడూ జరగకూడదు.. 6) ముఖ్యంగా మన పంచాయతీలో ప్రభుత్వం నుండి ప్రజలకు ఏదయినా ఉచితంగా వస్తే రానివ్వండి,, నిజంగా ఆ కుటుంబానికి అర్హత లేకుండా వచ్చినా రానివ్వండి.. ఏం మీ జేబులో డబ్బులేం పోవల్లేదు కదా,, ప్రభుత్వం డబ్బేగా పోతుంది. పోతే పోనివ్వండి,, అది వస్తుందా పోతుందా అన్నది సచివాలయ ఉద్యోగులు చూసుకుంటారు. సచివాలయ సిబ్బంది ఉన్నది తిని కూర్చోడానికి కాదు, ప్రజలకు పని చేసి పెట్టడానికి, అది వాళ్ళు చూసుకుంటారు.. అంతే తప్ప వాడికి జాబ్ ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, భూమి ఉంది, వాడు ఆ పార్టీ వాడు, ఇలాంటి వంకలు చెప్పి ఉచితంగా వచ్చేవాటిని చెడ thenగే ప్రయత్నాలు చేయకండి. అయినా కొడుక్కి జాబ్ ఉంటే తల్లిదండ్రులకు రేషన్ ఇవ్వడానికి మీకు ఏం ఇబ్బంది ఉచితమే కదా..!. మీ నాయకులకు మీ చెంచాలకు ఉన్నంత సంపదలు ఇక్కడ ప్రజలకు లేవు. 7) కొంత మంది ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినా ఈ సారి జరగబోయే ఎన్నికలు కేవలం రెండు కుటుంబ గొడవలు మూలాన ఆధిపత్య పోరు కై జరుగుతున్నాయనేది వాస్తవం. కాబట్టి వీలైతే పగలు ప్రతీకారాలు మరిచి అందరూ కలిసి ఉండి పంచాయితీని అభివృద్ధి 'కాదు కాదు' అభివృద్ధి అనే పదానికి మన పంచాయతీ చాలా దూరంలో ఉంది కాబట్టి ముందు ప్రజలకు అవసరమయ్యే కనీస సౌకర్యాలు కల్పించండి. లేదు మీ వ్యక్తిగత కుటుంబ గోడవలతో మీ ఊరిని రెండు వర్గాలుగా విడగొట్టి తన్నుకొని తగలబెట్టుకుంటామంటే తగలబెట్టుకోండి,, కానీ ఆ మంటల సెగలు పక్క ఊర్లకు తగలకుండా చూసుకోవలసిన భాద్యత మీపై ఉంటుంది.. కానీ ఆల్రెడీ ఆ సెగ రావిపాడుకి ఎలా తగిలించేశారో కానీ తగిలించేశారు. కాబట్టి రావిపాడు లో రాబో

Kommentare

Caricamento...